చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ | - | Sakshi
Sakshi News home page

చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ

Sep 18 2026 1:51 AM | Updated on Sep 18 2026 1:51 AM

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య

నెహ్రూసెంటర్‌: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటం, చరిత్రను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వక్రీకరిస్తుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌.వీరయ్య అన్నారు. సెప్టెంబర్‌ 17 సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో గురువారం తెలంగాణ సాయుధ పోరాట వార్సికోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమైనప్పటికీ దొరల నియంతృత్వ పాలన కొనసాగిందన్నారు. సాయుధ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని, రైతాంగ పోరాట స్ఫూర్తితో ఎర్రజెండా రాజ్యం కోసం పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌, సూర్నపు సోమయ్య, సమ్మెట రాజమౌళి, బానోత్‌ సీతారాంనాయక్‌, రావుల రా జు, దుడ్డెల రాంమూర్తి, చాగంటి భాగ్యమ్మ, కుమ్మరికుంట్ల నాగన్న, హేమానాయక్‌, లక్ష్మీనారాయణ, బానోత్‌ బాబు, పట్ల మధు పాల్గొన్నారు.

మానుకోటలో సీపీఐ ర్యాలీ

తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి అన్నారు. సెప్టెంబర్‌ 17 సాయుధ పోరాట దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం విజయసారథి మాట్లాడుతూ.. భారత్‌లో హైదరాబాద్‌ సంస్థానం విలీనం సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవంగా భావించాలన్నారు. సాయుధ పోరాటంలో పాల్గొనని బీజేపీ చరిత్రను వక్రీకరించి హిందూ, ముస్లిం పోరాటంగా ప్రజలను నమ్మించేందుకు యత్నిస్తుందన్నారు. కార్యక్రమంలో అజయ్‌సారథిరెడ్డి, నల్లు సుధాకర్‌రెడ్డి, పెరుగు కుమార్‌, రేషపల్లి నవీన్‌, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగాచారి, వరిపెల్లి వెంకన్న, నెల్లూరు నాగేశ్వర్‌రావు, మందు మహేందర్‌, రమేష్‌, నర్ర సంధ్యాశ్రావణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement