ఆటో డ్రైవర్లకు బడ్జెట్‌ కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్లకు బడ్జెట్‌ కేటాయించాలి

Sep 17 2026 1:26 AM | Updated on Sep 17 2026 1:26 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఆటో డ్రైవర్ల యూనియన్‌(తాడు) గౌరవ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్‌రెడ్డి అన్నారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు నలమాస సాయి ఆధ్వర్యంలో బుధవారం ఆటో డ్రైవర్లు మహార్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన ప్రతీ ఆటో డ్రైవర్‌ కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాలని, ప్రతీ ఆటో డ్రైవర్‌కు రూ.12వేలు అందజేయాలన్నారు. ప్రత్యేక ఆటో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.1,000 కోట్ల బడ్జెట్‌ కేటాయించాలని, సబ్సిడీపై ఆటోలు అందించాలన్నారు. ఇళ్లు లేని ఆటో డ్రైవర్లకు స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల ఆగడాలను అరికట్టి వడ్డీ, స్లాబ్‌ సిస్టమ్‌ తొలగించాలన్నా రు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, ఏరి యాల్లో పార్కింగ్‌, ఆటో స్టాండ్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వీరభధ్రయ్య, కోశాధికారి శ్యాంకుమార్‌, వివిధ మండలాల అధ్యక్షులు జానిమియా, సైదులు, మల్లేష్‌, నాగరాజు, సురేష్‌, యాకూబ్‌పాషా, విజయ్‌, రవి, శ్రీనివాస్‌, చంటి, వెంకటేష్‌, నారాయణ, ప్రభాకర్‌, గిరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆటోయూనియన్‌ గౌరవ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement