మహబూబాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

మహబూబాబాద్‌

Sep 13 2026 1:06 AM | Updated on Sep 13 2026 1:06 AM

వెదురు బొంగులు, కొబ్బరి మట్టలతో మండపం..

ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

7

మహబూబాబాద్‌ పట్టణంలో 1982వ సంవత్సరంలో చిదిరాల జయశంకర్‌ ఇంటి ముందు అప్పటి కొత్త బజార్‌ ఇప్పుడు నెహ్రూసెంటర్‌ ఏరియాలో తొలిసారిగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని నివాసం ఉండే అన్ని వర్గాలకు చెందిన వారు చందాలు వేసుకొని మొత్తం రూ.5వేల పోగుచేశారు. వెదురు బొంగులు, అరటి, కొబ్బరి మట్టలతో మండపం తయారు చేసి మట్టి విగ్రహాలు పెట్టి పూజలు చేసే వారు. నవరాత్రులు వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, చింతామణి, హరిచంద్ర నాటకాలు, గౌరీ బుర్రకథ, హరికథలు చెప్పించేవారు. పట్టణ ప్రజలతోపాటు, సమీప ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు కూడా నవరాత్రులకు ఎడ్లబండ్లు, సైకిళ్లపై వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు చూసేవారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రముఖ ఆర్కెస్ట్రా జిత్‌మోహన్‌ మిత్ర, ఇంద్రజాల ప్రదర్శన కోసం బీవీ పట్టాభిరాం వంటి వారిని తీసుకొచ్చి ప్రదర్శనలు ఇప్పించేవారు. బంధం చెరువు, మున్నేరు వాగులో నిమజ్జనం చేసేవారు. ఇప్పుడు అంతా మారిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement