ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా చంటి | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా చంటి

Sep 13 2026 1:06 AM | Updated on Sep 13 2026 1:06 AM

ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా చంటి రైల్వే విద్యుదీకరణ పనుల తనిఖీ అంతర్జాతీయ విద్యాసదస్సుకు ఉపాధ్యాయుల ఎంపిక

మహబూబాబాద్‌ అర్బన్‌: నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) మానుకోట జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కేంద్రానికి చెందిన భల్లేం చంటి శనివారం నియామకయ్యారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ జిల్లాలో ఎన్‌ఎస్‌యూఐ మరింత బలోపేతం చేస్తామన్నారు. తన నియామకానికి సహకారించిన జాతీయ అధ్యక్షుడు వినోద్‌జాఖర్‌, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు యాదవపల్లి వెంకటస్వామి, ఎంపీ పోరిక బలరాంనాయక్‌, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్‌, జాటోతు రామచంద్రునాయక్‌, డీసీసీ అధ్యక్షుడు భూక్య ఉమలకు కృతజ్ఞతలు తెలిపారు.

డోర్నకల్‌: స్థానిక రైల్వే జంక్షన్‌ పరిధిలో జరుగుతున్న విద్యుదీకరణ పనులను శనివారం దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ జీవీ మల్లిఖార్జునరావు తనిఖీ చేశారు. ప్రత్యేక రైలులో డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆయన మూడవ లైన్‌కు సంబంధించి ఓహెచ్‌సీ లైన్‌తో పాటు యార్డులోని ఓహెచ్‌సీ లైన్‌ తనిఖీ చేశారు. ఆయన వెంట రైల్వే ఉన్నతాధికారులు ఉన్నారు.

కేసముద్రం/గూడూరు: విద్యావ్యవస్థలో అంతర్జాతీయ స్థాయి ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘టీచర్స్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ఎక్సేంజ్‌ ప్రోగ్రామ్‌’కు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. కేసముద్రం మండలం కల్వల జెడ్పీ హైస్కూల్‌కి చెందిన హెచ్‌ఎం బండారు నరేందర్‌, నెల్లికుదురు మండలంలోని పీఎం శ్రీ పాఠశాలలో సోషల్‌ స్టడీ టీచర్‌గా పనిచేస్తున్న ఎం.ఎ. అంజుమ్‌సుల్తానా ఎంపికయ్యారు. ఫిన్లాండ్‌, జపాన్‌, సింగపూర్‌, వియత్నాం, చైనా దేశాల్లో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, విద్యార్థుల అభ్యసన నైపుణ్యాల అభివృద్ధి, అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను పరిశీలించి, వాటిలో ఉపయోగకరమైన అంశాలను మన విద్యావ్యవస్థలో అమలు చేసేందుకు ఈ విదేశీ విద్యా పర్యటన దోహదపడుతుందన్నారు. ఈనెల చివరి వారంలో విదేశి పర్యటన ఉండనుంది. ఎంపికై న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయబృందంతో పాటు, పలువురు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement