హన్మకొండ: తెలంగాణ భాష, యాస, సంస్కృతి, జీవన విధానానికి కాళోజీ నారాయణరావు నిలువుటద్దమని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ విగ్రహానికి సీఎండీ, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల జీవితాలు, వారి సమస్యలను తన రచనల ద్వారా ప్రతిబింబిస్తూ సామాజిక చైతన్యానికి కృషి చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు అన్నారు. ఆయన తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. డైరెక్టర్లు వి.తిరుపతి రెడ్డి, సి.ప్రభాకర్, సి.ఈలు అన్నపూర్ణ, మల్లికార్జున్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, వేణుబాబు, జీఎంలు హేమంత్ కుమార్, వెంకట కృష్ణ, అనిల్ రెడ్డి, జయరాజ్, విజేందర్ రెడ్డి, బాబురావు, అమర్‌నాథ్, శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్
సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి


