మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించాలి

Aug 15 2026 12:58 AM | Updated on Aug 15 2026 12:58 AM

చిన్నగూడూరు: మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ శబరీష్‌ ఆదేశించారు. మండల కేంద్రంలోని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టా లన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందించేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. మరిపెడ సీఐ పవన్‌కుమార్‌, ఎస్సైలు కుశకుమార్‌, సతీష్‌, సంతోష్‌, ఏఎస్సై వెంకటయ్య, హెడ్‌ కానిస్టేబుల్‌ కొండల్‌ రావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement