అందరి సహకారంతోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

అందరి సహకారంతోనే అభివృద్ధి

Aug 9 2026 1:58 AM | Updated on Aug 9 2026 1:58 AM

ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌

రూ.46 లక్షల అభివృద్ధి పనులకు

శంకుస్థాపన

మహబూబాబాద్‌: అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 29 వార్డులో రూ.46 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మురళీనాయక్‌ మాట్లాడుతూ.. మానుకోట మున్సిపాలిటీని ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. అభివృద్ధి పనులకు రూ.59 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా మానుకోటను అభివృద్ధి చేసుకోవాలన్నారు. వరద కాల్వల నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించామని దాంతో ముంపు ప్రాంతాల సమస్య తీరుతుందన్నారు. దశల వారీగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి, వైస్‌ చైర్మన్‌ సూర్నపు సోమయ్య, కౌన్సిలర్లు బొల్లు రాజు, పుచ్చకాయల సరిత, బాబు, నాయకులు ఎడ్ల రమేష్‌, జ్ఞానేశ్వర్‌, వెంకట్‌, చరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement