నర్సంపేట: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంటికి రానున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విదితమే.
విద్యార్థులపై నిఘా ఉండాలి
మహబూబాబాద్ అర్బన్: గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు, విద్యార్థులపై 24 గంటలు ప్రిన్సిపాల్స్ నిఘా ఉండాలని గిరిజన సంక్షేమ గురుకులాల ఆర్సీఓ నారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకులాల ఆర్సీఓ కార్యాలయంలో ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం మెనూ ప్రకారం అందించాలని, గురుకుల పాఠశాల, కళాశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి అవసరమైన వాతావరణం కల్పించాలని, వారు క్రమశిక్షనతో చదివి లక్ష్యాలను సాధించేలా ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలని చెప్పారు.
ఆత్మ కమిటీ చైర్మన్‌గా
గోవర్ధన్ రెడ్డి
మహబూబాబాద్ రూరల్/ మహబూబాబాద్ అర్బన్: ఆత్మ కమిటీ చైర్మన్‌గా మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన వెన్నం గోవర్ధన్ రెడ్డిని ఆత్మ కమిటీ సభ్యులు శనివారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జెన్నారెడ్డి జనార్ధన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ ను గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి, వార్డు కౌన్సిలర్ బోడ రవి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అజ్మీరా సురేష్, నాయకులు మిట్టకంటి రామిరెడ్డి, దూపటి వినయ్ కుమార్, చిదిరాల జ్ఞానేశ్వర్, గోనే శ్యాంరావు, చీరిక ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
కొత్తగూడ: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ డీడీ దేశీరాంనాయక్ సూచించారు. శనివారం మండలకేంద్రంలో ఆదివాసీ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ దినోత్సవ నిర్వహణ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రజలు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ ఉద్యోగులు ఆదిలక్ష్మి, శ్రీనివాస్, సాయిలు, సమ్మయ్య, నాయకులు సందీప్, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణపై విచారణకు ఆదేశించాలి
గార్ల: మండలంలో చేపట్టిన మున్నేరు టు పాలేరు లింక్ కెనాల్ భూసేకరణపై జాతీయ ట్రైబల్ కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్ సమర్పించిన తప్పుడు నివేదికను తిరస్కరించి, ఆర్టికల్ 338ఎ(8) ప్రకారం తక్షణమే క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించాలని టీవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంపాల విశ్వ కోరారు. శనివారం గార్లలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ స్టేటస్ రిపోర్ట్‌ను తిరస్కరించాలని షెడ్యూల్ తెగల రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని జాతీయ ట్రైబల్ కమిషన్‌ను కోరారు. మండలంలోని ఏకై క నీటి వనరు మున్నేరు నది నీటిని లింక్ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు మళ్లించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పాలేరు రిజర్వాయర్‌కు ఇప్పటికే నాగార్జున సాగర్, సీతా రామ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వస్తున్నా, మున్నేరు నది నీళ్లు తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లింకు కెనాల్ కోసం ఏర్పాటు చేసిన పీసా గ్రామసభల్లో 1/3 గిరిజనులు హాజరు కాకున్నా తప్పుడు సంతకాలు పెట్టించిన పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీ య ఎస్టీ కమిషన్ సమగ్రంగా విచారణ జరిపి తప్పుడు నివేదిక పంపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.


