న్యూస్‌రీల్
రసాయనాలు వద్దు.. ఆర్గానిక్ ముద్దు అని నిర్ణయం
● ప్రధానంగా ఇంటి అవసరాలకు..
● సేంద్రియ ఎరువులతో సాగు
సాక్షి, మహబూబాబాద్:
పెరిగిన శాస్త్ర విజ్ఞానం, అందిపుచ్చుకున్న ఆవిష్కరణలు అన్నీ మానవ సంపత్తే అయినా.. మానవ మనుగడకు ఉపయోగపడటమే కాకుండా మాన వినాశనానికి కూడా దోహద పడుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తిలేదు.! వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, కొత్త వంగడాలు, హైబ్రీడ్ రకాలు, పంట పెరిగేందుకు, చీడపీడల నివారణకు దోహదపడుతాయి. కానీ అదే విధంగా వాతావరణాన్ని కలుషితం చేయడం, కేన్సర్ లాంటి భయానక వ్యాధుల బారిన పడేందుకూ కీలకంగా ఉంటున్నాయి. ఇంతటి ప్రమాదకరమైన ఆహార పదార్థాలు తినడం రోగాలు కొని తెచ్చుకోవడం ఎందుకని రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వినియోగానికి స్వస్తిచెప్పి సేంద్రియ ఎరువులు, పురాతన పద్ధతులతో వ్యవసాయం చేయడం అలవాటు చేసుకున్నవారు కొందరు. అయితే.. వ్యవసాయ భూమిలో ఏ పంటలు వేసుకున్నా.. తాము తినే పంటలను మాత్రం సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. మరికొందరు అయితే ఫామ్ హౌజ్‌ల్లో సేంద్రియ సాగుతో కూరగాయలు, పండ్లు పండించుకొని తిని తృప్తిపడుతున్నారు.
సేంద్రియ కూరగాయలు..


