న్యూస్‌రీల్
గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026
వ్యవసాయ శాఖ పథకాలపై సమీక్ష
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పథకాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులు బుధవారం సమీక్ష చేపట్టారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ పథకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న పథకాలు, ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలసాగు వివరాలు, ఎరువుల లభ్యత, విత్తన నమూనాల సేకరణపై సమీక్ష నిర్వహించారు. వీసీలో డీఏఓ విజయచంద్ర, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
స్థల పరిశీలన
ఇనుగుర్తి: మండల కేందంల్రో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని బుధవారం అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ పరిశీలించారు. భవన నిర్మాణానికి స్థలం అనుకూలత, సర్వే నంబర్ల వివరాలను రెవెన్యూ అధికారులరు అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ పనులు త్వరి తగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవా లని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ బండారు పార్థసారథి, డీఈ లూర్ద్, ఆర్‌ఐలు బషీర్, మున్వర్ అలీ, దిశ కమిటీ సభ్యుడు గుజునూరి బాబురావు, ఇనుగుర్తి సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
విద్యుత్ శాఖ ఎస్‌ఈగా దర్శన్‌కుమార్
నెహ్రూసెంటర్: జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్‌ఈ)గా దర్శన్‌కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండలో టెక్నికల్ డీఈగా పనిచేసిన ఆయన పదోన్నతిపై మహబూబాబాద్‌కు బదిలీ అ య్యారు. ఇక్కడ ఎస్‌ఈగా పనిచేసిన విజయేందర్‌రెడ్డి వరంగల్‌కు బదిలీ అయ్యారు.
మీసేవ నిర్వాహకులు మార్గదర్శకాలు పాటించాలి
గార్ల: మీ సేవ నిర్వాహకులు ప్రభుత్వ మార్గదర్శకాలను విధిగా పాటించి, దరఖాస్తుదారులతో మర్యాదగా వ్యవహరించాలని జిల్లా మీసేవ మేనేజర్ యుగంధర్ సూచించారు. బుధవారం గార్లలోని మీసేవ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారదర్శకంగా, నాణ్యతతో సకాలంలో సేవలు అందుతున్నాయా అని మీ సేవకు వచ్చిన దరఖాస్తుదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ మీసేవ కేంద్రంలో సిటిజన్ చార్టర్ ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా ప్రదర్శించాలన్నారు. సిటిజన్ చార్టర్‌లో మీసేవ అందించే సేవలు, సేవల రుసుములు, సేవల కాలపరిమితి, ప్రజల హక్కులను ప్రదర్శించాలని నిర్వాహకులకు సూచించారు. సేవలకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఎదురైతే ప్రజ లు నేరుగా జిల్లా మేనేజర్ సెల్ నంబర్ 79950 16039కు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుముకు మించి అదనంగా చార్జీలు వసూలు చేయొద్దని నిర్వాహకులను ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఏకరూప దుస్తులు అందిస్తోంది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు అందించలేదు. ఏటా పాఠశాలల పునఃప్రారంభం రోజే ఇవ్వగా..ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇవ్వలేదు. దుస్తుల రంగులు మారుస్తాం.. పద్రాగస్టుకు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం సగం బడులకు మాత్రమే క్లాత్ పంపించింది. ఇందులో కూడా అంగీ క్లాత్ ఉంటే.. లాగు క్లాత్ సరిగా లేకపోవడం.. లాగు క్లాత్ ఉంటే అంగీ క్లాత్ సరిగా లేదు. ఇటువంటి పరిస్థితిలో విద్యార్థులకు పంద్రాగస్టు వేడుకలకు పాత దుస్తులే దిక్కుగా మారనున్నాయి.
సగం పాఠశాలలకు క్లాత్..
పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు అవుతోంది. మొదటి రోజు ఇవ్వాల్సిన దుస్తులు ఇప్పటి వరకు అందించలేదు. దుస్తులు కుట్టించేందుకు జిల్లాలకు క్లాత్ పంపిచామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో సగం పాఠశాలలకు కూడా క్లాత్ రాలేదని తెలిసింది. జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్స్, మోడల్ స్కూల్స్ ఇలా మొత్తం 11 విభాగాలకు చెందిన 928 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం 71,188 మంది విద్యార్థులు చదువుతున్నారు. చిన్నపిల్లలకు నిక్కర్, షర్ట్, పెద్ద పిల్ల లకు ప్యాంట్, షర్ట్, బాలికలకు టాప్, పర్కిన్, లెగ్గిన్‌లతో కూడిన రెండు జతలు, ఒక వైట్ డ్రస్ ఇవ్వాలి. మొత్తం 1,68,434 జతలకు గాను ఇప్పటి వరకు 26,940 జతలకు మాత్రమే క్లాత్ వచ్చింది. మిగిలిన క్లాత్ ఇప్పటి వరకు రాలేదు. ఇందులో కేజీబీవీలు, జ్యోతిరావుపూలే, మైనార్టీ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏకలవ్య పాఠశాలకు మాత్రమే కొన్నచోట్ల రెండు జతలకు, మరికొన్నిచోట్ల ఒక్క జతకు క్లాత్ వచ్చింది.
అన్ని విభాగాల పాఠశాలలు
928
విద్యార్థులు: 71,188
అందిన దుస్తులు: 15,861
అందాల్సినవి
55,327
● ప్రమాదకర లో–లెవల్ వంతెనపై రాకపోకలకు అనుమతి
మరో వారం రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. పంద్రాగస్టుకు కొత్త దుస్తులు వేసుకోవడం పరిపాటి. అయితే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సగం మందికి కొత్తదుస్తులు లేకపోవడంతో పాత వాటితోనే జెండా పండుగ జరుపుకోనున్నారు. ప్రధానంగా కొన్ని పాఠశాలలు అందులో కేజీబీవీలు, జ్యోతిరావుపూలే, మైనార్టీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్‌తో పాటు ఏకలవ్య గురుకులాలకు కొత్తదుస్తులు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 135 గురుకులాలు, పాఠశాలలకు చెందిన 24,069 మంది విద్యా ర్థులకు మెప్మా సంఘాల మహిళలతో, మండలాల్లోని పాఠశాలలు, గురుకులాల్లో చదివే 47,119మంది విద్యార్థులకు ఆయా ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలతో దుస్తులు కుట్టిస్తున్నారు. అయితే ఇందులో కేజీబీవీల్లో చదివే 352 మంది, జ్యోతిరావుపూలే గురుకులాల్లో చదివే 304 మంది, ట్రైబల్ వెల్ఫేర్‌లో చదివే 593 మంది విద్యార్థులకు పర్కిన్, పైజామా క్లాత్ రాగా.. టాప్ క్లాత్ తక్కువగా వచ్చింది. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, తెలంగాణ మోడల్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు క్లాత్ రానందున వారికి పంద్రాగస్టుకు దుస్తులు ఇచ్చే అవకాశం లేదు. పాత దుస్తులతోనే హాజరుకానున్నారు.
పాత దుస్తులతోనే..
జిల్లాలోని విద్యార్థుల వివరాలు
ప్రభుత్వ పాఠశాలలకు సరఫరాలో జాప్యం
వచ్చిన క్లాత్ కుట్టించేందుకు అధికారుల తంటాలు
త్వరగా కుట్టించేందుకు ప్రయత్నిస్తున్నాం..
జిల్లాలోని అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులకు పంద్రాగస్టుకు కొత్తదుస్తులు అందించే ప్రయత్నంలో ఉన్నాం. ఇందులో కొన్ని జతలు మెప్మా, మరికొన్ని జతలు సెర్ప్ మహిళలకు అందజేశాం. అవి కుట్టి ఇస్తున్నారు. ఇప్పటి వరకు క్లాత్ రాని చోట్ల త్వరగా క్లాత్ అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. వీలైనంత త్వరగా దుస్తులు కుట్టించి విద్యార్థులకు అందజేస్తాం.
– సత్యనారాయణమూర్తి,
జిల్లా విద్యాశాఖ అధికారి


