స్కూల్‌ యూనిఫామ్‌ త్వరగా అందించాలి | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ యూనిఫామ్‌ త్వరగా అందించాలి

Aug 6 2026 12:51 AM | Updated on Aug 6 2026 12:51 AM

గూడూరు: ప్రభుత్వం విద్యార్థులకు అందించే స్కూల్‌ యూనిఫామ్‌ కుట్టు పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అన్నారు. మండలంలోని కొల్లాపురంలో శ్రీ సమ్మక్క–సారక్క గిరిజన ఆదివాసీ టైలర్‌ సంఘం ఆధ్వర్యంలో కుడుతున్న దామరవంచ స్కూల్‌ పిల్లల యూనిఫామ్‌ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా దుస్తులు కుట్టే మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దామరవంచ గురుకులానికి చెందిన 500 మంది విద్యార్థుల యూనిఫామ్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు.

నీటి కుంటలు సద్వినియోగం చేసుకోవాలి..

భూగర్భ జలాల పెంపు, కరువుకాలంలో పంటలను కాపాడుకోవడానికి ఉపయోగపడే నీటి కుంటలను రైతులు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ సూచించారు. మండలంలోని గుండెంగలో వీబీజీ రాంజీ పథకంలో రైతుల పంట భూముల్లో తవ్వించిన ఫామ్‌ పాండ్స్‌ (నీటి కుంటలు)లను కలెక్టర్‌ పరిశీలించారు. కొలతల ప్రకారం ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు పడక ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి నీటి కుంటలు ఎంతో ఉపయోగకరమన్నారు. ఈజీఎస్‌ ఏపీడీ మల్లీశ్వరి, తహసీల్దార్‌ నాగభవాని, ఎంపీడీఓ సత్యనారాయణ పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సహకరించాలి

మహబూబాబాద్‌: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు పూర్తిస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ కోరారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం సర్‌ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు ఓటరు డిజిటలైజేషన్‌ కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో నిమగన్నమై పని చేస్తున్నారన్నారు. రాజకీయ పార్టీల నాయకులు బీఎల్‌ఓలకు, అధికారులకు సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు మార్నేని వెంకన్న, సురేష్‌నాయుడు, శ్యాంసుందర్‌శర్మ, రామారావు, విజయ్‌కాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ స్నేహశబరీష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement