బ్రిడ్జి పునరుద్ధరణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ కనీస భద్రతా చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక రహదారికి హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, ఇనుప రక్షణ కంచెలు, వంతెనపై సీసీ నిర్మాణం ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని మండిపడుతున్నారు. హైవే అథారిటీ అధికారులు స్పందించి భద్రతా చర్యలు చేపట్టాలని, లేదంటే ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, హైవే అథారిటీ అధికారులు వెంటనే స్పందించి తాత్కాలిక వంతెన వద్ద రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు దుమ్మ, ధూళి నియంత్రణకు సీసీ నిర్మాణం ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.


