మహబూబాబాద్ రూరల్: పోలీసు శాఖపై ప్రజలకు విశ్వాసం పెరిగే విధంగా, పారదర్శకంగా పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేయాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నా.. జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇందుకు భిన్నంగా సేవలు అందుతున్నాయి. సబంధిత పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ ప్రమాద ఘటనకు సంబంధించి నమోదైన కేసులో ఒకరికి నోటీసు ఇచ్చే సమయంలో పోలీసులు అడిగిన మేరకు కొంత మొత్తాన్ని బాధితుడు ముట్టజెప్పాడు. కొద్దిరోజుల తర్వాత అతడు వాహనాన్ని కోర్టు ద్వారా విడుదల చేయించుకుని ఉత్తర్వులు తీసుకు రాగా మళ్లీ మరికొంత డబ్బులు కావాలని బాధితుడిని పోలీసులు ఇబ్బందిపెట్టారు. దీంతో సంబంధిత పోలీసు ఉద్యోగులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా ఆ మొత్తాన్ని బాధితుడికి అప్పగించి వాహనాన్ని విడుదల చేశారు.


