కురవి: మండలకేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించిన సత్రాలు (గదులు) శిథిలావస్థకు చేరుకోవడంతో దర్శనానికి వస్తున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా సరైన నిర్వహణ, మరమ్మతు లేకపోవడంతో ఎప్పుడు కూలుతుందో తెలవని పరిస్థితి నెలకొంది. ఆలయ పరిధిలో మొత్తం నాలుగు బ్లాకులు ఉండగా ఏ, బీ బ్లాకులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. స్లాబ్ పైపెచ్చులు ఊడి కిందపడిపోతుండడంతో భక్తులకు ప్రమాదం పొంచి ఉంది. గదుల్లో భోజనాలు చేసే సమయంలో పెచ్చులూడి పలువురికి గాయాలైన సంఘటనలు ఉన్నాయి.
శిథిలమైన భవనాలను తొలగించాలి
ఏళ్ల క్రితం నిర్మించిన సత్రాలు (గదులు) శిథిలావస్థకు చేరుకోవడంతో అవి పనికిరాకుండా పోతున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించి నూతన భవనాలు నిర్మించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం శిథిలమై ఉన్న సత్రాలు మొత్తం భక్తులు నిర్మించుకున్నవే. వాటిని తొలగించి ఫ్రభుత్వ నిధులతో కొత్తగా గదులను నిర్మిస్తే మరో కొన్నేళ్లపాటు భక్తులకు ఇబ్బందులుండకుండా ఉంటుంది. ఆలయ పాలకవర్గం చొరవ చూపి ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి నూతన భవనాలు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.
వసతిలేక ఇబ్బందులు పడుతున్న భక్తులు
నూతన గదులు నిర్మించాలని వేడుకోలు


