ఆకట్టుకునేలా!
పెరిగిన పర్యాటకుల సంఖ్య..
ఆదాయం రెట్టింపు..
పర్యాటకంగా మరింత అభివృద్ధి
ఖానాపురం: పాకాల.. పచ్చందాలకు నెలవు. ఆ హ్లాదకర వాతావరణానికి నిలయం. పక్షుల కిలకిలరావాలు, సరస్సులోని నీటి అలల సవ్వడి, చిలకలగుట్ట అందాలు పర్యాటకులను కనువిందు చేస్తా యి. గతంలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉన్న పాకాలకు పర్యాటకులు తాకిడి అంతంత మాత్రంగా ఉండేది. అయితే అటవీ శాఖ ఇక్కడి ఆభయారణ్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులతో కొన్ని సంవత్సరాల నుంచి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్ శివారులోని పాకాల పర్యాటక ప్రాంతానికి ఉమ్మడి వరంగల్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తారు. సెలవు, ప్రతీ ఆదివా రాల్లో వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చి అందాల ను వీక్షిస్తూ ఉత్సాహంగా గడుపుతారు. వర్షాకాలంలో సరస్సు మత్తడి పరవళ్లలో జలకాలాడుతూ ఉత్సాహంగా గడుపుతారు. మత్తడి పోసిన అన్నీ రోజులు పర్యాటకుల సంఖ్య భారీగానే ఉంటుంది. దీంతో పర్యాటకుల ద్వారా వచ్చిన నిధులతో పాటు అటవీశాఖ ఆధ్వర్యంలో వచ్చే నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
పాకాల.. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది వరంగల్ జిల్లా స్థాయిలో ఏకై క పర్యాటక ప్రాంతంగా పేరొందింది. నర్సంపేట నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉండే పాకాలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపడుతున్నారు. ప్రస్తుత సంవత్సరం రూ.50 లక్షల వ్యయంతో గేట్ వద్ద నుంచి చివరి వరకు 1.5 కిలో మీటర్ల మేర సీసీ రోడ్డు, డార్మెటరీ మరమ్మతులు, ఈసీ భవన పునరుద్ధరణ, తూముల ఆధునికీకరణ, బటర్ ఫ్లైగార్డెన్ వద్ద సెల్ఫీ పాయింట్, ఆర్చ్‌లు, మూడు పెడల్‌బోట్స్, పార్కింగ్ స్థల అభివృద్ధి, బటర్‌ఫ్లై గార్డెన్ సమీపంలో ఫూల్ నిర్మాణం, రెండు బ్యాటరీ వాహనాలు, షెడ్ నిర్మాణం, ఓపెన్ ఎయిర్ క్యాంటీన్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
పాకాలకు పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గేట్ ఎంట్రీ, వాహనాల రుసుము, పర్యాటకుల హాజరుకు రుసుములను అటవీశాఖ ఆధ్వర్యంలో తీసుకుంటున్నారు. దీంతో 2024 సంవత్సరంలో 33,500 మంది పర్యాటకులు పాకాలను సందర్శంచడంతో రూ.18.50 లక్షల ఆదాయం సమకూరింది. 2025లో 44,500 మంది పర్యాటకులు సందర్శించడంతో రూ. 30.50లక్షల ఆదాయం సమకూర్చుకుంది. ప్రకృతి అందంతో పాటు పాకాలలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మంత్రముగ్ధులవుతున్నారు. దీంతో పర్యాటకుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోది. గత సంవత్సరం కంటే ప్రస్తుతం పెరగడంతోపాటు ఆదాయం కూడా రెట్టింపుగా పెరిగింది.
పాకాల..వరంగల్ జిల్లాలో ప్రధాన పర్యాటక ప్రాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అన్ని రకాల వసతులు అందుబాటులోకి తీసుకొస్తాం. ఉన్నతాధికారుల సహకారంతో నిధులు మంజూరయ్యాయి. దీంతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఈ పనులతో పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ప్రస్తుతం పర్యాటకుల సంఖ్య పెరిగింది. – పుప్పాల రవికిరణ్, ఎఫ్‌ఆర్వో, నర్సంపేట
ఆకట్టుకునేలా!
ఆకట్టుకునేలా!


