కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
చిన్నగూడూరు: కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్(డీపీఎంఓ) వనాకర్ రెడ్డి అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఉగ్గంపల్లి శివారు మాలోత్ తండాలో లెప్రసీ కేసు డిటెక్షన్ సర్వే పని తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్ఠు వ్యాఽధి ప్రాథమిక దశలో తెలుపు రంగు మచ్చలు, ఎరుపురంగు, గోధుమ వర్ణం కలిగి స్పర్శజ్ఞానం కోల్పోవడం జరుగుతుందన్నారు. వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పీహెచ్‌సీల్లో ఉచితంగాచికిత్స చేస్తారని తెలిపారు. ఈ నెల 31వరకు ఆశవర్కర్లు ప్రతీ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కుష్ఠు వ్యాధి అంటువ్యాధి కాదని అన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ నర్సులు, ఆశవర్కర్లు ఉన్నారు.


