ఒక్కటే జీపీ.. వేర్వేరు చోట్ల ప్రమాణస్వీకారాలు
● బోటిమీది తండా జీపీలో విచిత్ర పరిస్థితి
ఖానాపురం : మండల వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లతో పాటు పాలకవర్గాలు ప్రమాణ స్వీకారాలు చేశాయి. కానీ మండలంలోని బోటిమీదితండాలో మాత్రం విచిత్ర ప్రమాణ స్వీకారం చేశారు. మొదట ఎంపీడీఓ అద్వైత సమక్షంలో సర్పంచ్ భానుప్రసాద్, నలుగురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇదే జీపీలో కొనసాగుతున్న గొల్లగూడెంతండా చెందిన మరో ముగ్గురు వార్డు సభ్యులు మాత్రం బోటిమీది తండా జీపీలో కాకుండా గొల్లగూడెంతండాలోనే పాత జీపీ కార్యాలయం వద్ద కార్యదర్శి సమక్షంలో ఉపసర్పంచ్‌తో పాటు ముగ్గురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఈ జీపీ పాలకవర్గ ప్రమాణస్వీకార ప్రక్రియ విచిత్రంగా ఉందని పలువురు గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


