.. అనే నేను | - | Sakshi
Sakshi News home page

.. అనే నేను

Dec 23 2025 7:20 AM | Updated on Dec 23 2025 7:20 AM

.. అన

.. అనే నేను

ప్రమాణస్వీకారం చేసి కొలువుదీరిన జీపీ కొత్త పాలకవర్గాలు 24 ఏళ్లకే గ్రామ సారథిగా ఎన్నిక..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈ నెల 11,14, 17వ తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించిన జీపీ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు సోమవారం ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కొలువుదీరారు. మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, అనుచరగణంతో పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పలు చోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

బయ్యారం: మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలోని 29 పంచాయతీల్లో అతిచిన్న వయసున్న సర్పంచ్‌గా వర్సా దీప రికార్డులోకెక్కాకారు. నామాలపాడు సర్పంచ్‌ స్థానానికి స్వతంత్ర అభ్యర్థినిగా బరిలో దిగిన 24 సంవత్సరాల దీప ఎన్నికల్లో విజయం సాధించి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తనపై నమ్మకంతో గ్రామస్తులు గెలిపించారని, గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

నెల్లికుదురు: మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం నల్లగుట్ట తండా జీపీ సర్పంచ్‌గా 22 ఏళ్ల జి. హేమలత సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

75 ఏళ్ల వయసులో సర్పంచ్‌లుగా..

జనగామ రూరల్‌: మండలంలోని ఎర్రగొల్లపహాడ్‌కు చెందిన చిర్ర సత్యనారాయణ రెడ్డికి 75 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా అవకాశం లభించింది. 50 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న ఆయన ఇటీవల జరిగిన జీపీ ఎన్నికల్లో గెలుపొంది సర్పంచ్‌గా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అలాగే, గ్రామానికి చెందిన గుండెల్లి కల్పన రెండో సారి ఉప సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేశారు.

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి మండలం బావు సింగ్‌పల్లికి చెందిన పొనగంటి ముత్తమ్మ సర్పంచ్‌గా రెండో విడతలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 75 సంవత్సరాల వయసులో సోమవారం గ్రామ సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేశారు.

.. అనే నేను1
1/2

.. అనే నేను

.. అనే నేను2
2/2

.. అనే నేను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement