Telangana Crime News: తమ్ముడికి కాల్‌ చేసి.. 'అమ్మానాన్నలను బాగా చూసుకో'.. నేను..
Sakshi News home page

తమ్ముడు.. అమ్మా నాన్నలను బాగా చూసుకో!

Published Mon, Aug 14 2023 1:30 AM

- - Sakshi

వరంగల్‌: తల్లిదండ్రులకు భారం అవుతున్నాననే మనస్తాపంతో ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన బొమ్మ శివాజీ(24) బీఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తి చేసి కొంత కాలం ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసి, పోటీ పరీక్షలకు సిద్ధ అవుతున్నాడు.

ఈ క్రమంలో ఇటీవల రాసిన పరీక్షల్లో ఉద్యోగం రాకపోవడంతో అమ్మానాన్నలకు భారంగా మారుతున్నానని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తన సోదరుడికి సెల్‌ ఫోన్‌లో అమ్మానాన్నలను బాగా చూసుకో.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్‌ చేసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోదరుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా స్థానికులు బావి నుండి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రవీందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గట్ల సుధాకర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement