మొక్కలను ప్రేమగా చూసుకుంటే అంతకు మించిన రెట్టింపు సంతోషాన్నిస్తాయి. మనుషుల్లో స్వార్థం పెరిగిపోతున్న రోజుల్లో వీటికి దగ్గరవుతే మానసికంగా కూడా ప్రశాంతత లభిస్తుంది. యాంత్రిక జీవనంలో ఇలాంటి వ్యాపకాలతో ఎంతో ఊరట లభిస్తుంది. ఇంట్లోనే పండించిన కూరగాయలు, పండ్లను తింటే చెప్పలేని సంతృప్తి కలుగుతుంది. చుట్టుపక్క ఇళ్ల వాళ్లు వీటిని చూసి ఆశ్చర్యంగా వివరాలు తెలుసుకోవడం, కొన్నింటిని వాళ్లకు ఇచ్చి పంపడం ఈ కాంక్రీట్ వనాల్లో సన్నిహతులను చేస్తుంది.
– మంజుల, ఎ.క్యాంప్, కర్నూలు


