చ..చ..చ..చలి | - | Sakshi
Sakshi News home page

చ..చ..చ..చలి

Nov 22 2026 2:53 AM | Updated on Nov 22 2026 2:53 AM

చలి పులి భయపెడుతోంది. రోజురోజుకు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో చలి పంజా విసురుతోంది. రాత్రి వేళ పనుల మీద బయటకు వచ్చే వారు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు, ప్రయాణికులు, పారిశుద్ధ్య కార్మికులు, కూరగాయల వ్యాపారులు తప్పనిసరిగా చలిలోనే పనులు చేసుకోవాల్సి వస్తోంది. శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఉష్ణోగ్రతలు 16.5 డిగ్రీలకు చేరుకోవడంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. నగర ప్రజలు గజగజ వణికిపోయారు. చలికి తాళలేక స్వెటర్లు, మంకీ క్యాప్‌లు ధరించారు. మంటలు వేసుకుని కాసేపు ఊరట పొందారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, కర్నూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement