కర్నూలు: విద్యార్థులు మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్‌పోర్స్‌మెంట్ అసిస్టెంటు సూపరింటెండెంట్ రాజశేఖర్‌గౌడు, ఏఈఎస్ రామకృష్ణారెడ్డి సూచించారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్సీ –1 హాస్టల్‌లో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజశేఖర్‌గౌడు, రామకృష్ణారెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ....మాదకద్రవ్యాల వినియోగంతోమనిషి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు మానసిక, శారీరకంగా..ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందన్నారు. వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. కర్నూలు స్టేషన్ సీఐ చంద్రహాస్, ఎన్‌పోర్స్‌మెంటు సీఐ జయరామ్‌నాయుడు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మద్రాసి పాల్గొన్నారు.


