ప్రజలూ.. చంద్రబాబు మాటలు నమ్మొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజలూ.. చంద్రబాబు మాటలు నమ్మొద్దు

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

● వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి

కర్నూలు (టౌన్‌): ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే మాటలను ప్రజలు నమ్మవద్దని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని సూచించారు. కర్నూలు నగరంలోని 62వ వార్డు ఽకార్ల్‌మార్క్స్‌ నగర్‌కు చెందిన 30 కుటుంబాలు, పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరడం శుభపరిణామమన్నారు. తమ ప్రభుత్వం విస్తృతంగా సంక్షేమ పథకాలు అమలు చేసి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేసిందన్నారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలపై అనేక సందేహాలు నెలకొన్నాయన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరిన వారు ప్రజా సమస్యలపై నిరంతరం పోరా టం చేయాలన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో రమేష్‌, ప్రేమ్‌కుమార్‌, సుందర్‌రాజు, కిరణ్‌ కుమార్‌, ప్రసాద్‌, ప్రవీణ్‌, రాజేష్‌, శేఖర్‌, చరణ్‌, శంకర్‌, అరుణ్‌, ప్రమోదు, సువర్ణమ్మ, సందీప్‌,మోహన్‌ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఽ62వ వార్డు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ రాము పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement