అభ్యర్థులు మెంబర్లు
● మొదటి రోజున 460, రెండవ రోజు 1697 నామినేషన్లు
● రెండో రోజు సర్పంచు స్థానాలకు 510, వార్డు సభ్యుల స్థానాలకు 1187
కర్నూలు(అర్బన్): కార్తీక సోమవారం కావడంతో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు పోటెత్తాయి. జిల్లాలోని ఎనిమిది మండలాల్లోని 148 గ్రామ పంచాయతీల్లో సర్పంచు, 1520 వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 15వ తేదీ నుంచి 58 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. మొదటి రోజున సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు 460 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సర్పంచు స్థానాలకు 223, వార్డు సభ్యుల స్థానాలకు 237 నామినేషన్లను దాఖలు చేశారు. రెండో రోజైన సోమవారం సర్పంచు స్థానాలకు 510, వార్డు సభ్యుల స్థానాలకు 1187 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులుగా అనేక మంది ప్రజాబలంతో నామినేషన్లను దాఖలు చేశారు. చిప్పగిరి గ్రామ పంచాయతీ సర్పంచు స్థానానికి వైఎస్సార్‌సీపీ మద్దతుతో లిఖితారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఆలూరు ఎమ్మెల్యే బీ విరూపాక్షి హాజరై కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపారు.
మండలం సర్పంచ్ వార్డు
ఆదోని–1 69 142
ఆదోని–2 62 237
ఆలూరు 54 138
ఆస్పరి 69 79
చిప్పగిరి 55 79
హొళగుంద 59 120
హాలహర్వి 51 78
దేవనకొండ 91 314
మొత్తం 510 1,187


