తుగ్గలి గ్రామ పంచాయతీలో టీజీఎల్ బీమా/పవర్ ఆఫీసు దగ్గర ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ ఉపాధి పనుల ఊసే లేదు. అయినా ఇక్కడ 14.1 మీటర్లలో 35 పనులు చేపట్టినట్లుగా రికార్డులు సృష్టించారు. ఏకంగా రూ.62.94 కోట్లు స్వాహా చేశారు. మొత్తం 35 పనులకు అరువ భీముడు ఇంటి దగ్గరనే జీపీఎస్ ఏర్పాటు చేసుకున్నారు. కూలీల ముఖ గుర్తింపు ఫొటోలు తీశారు. స్థానికంగా ఉండే వారితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారందరు కూడా పనులకు హాజరైనట్లు సెల్ఫోన్లో ఉన్న వీడియోల ద్వారా ఫొటోలు అప్లోడ్ చేశారు.


