29న రెండో విడత పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

29న రెండో విడత పోలింగ్‌

Nov 17 2026 12:50 AM | Updated on Nov 17 2026 12:50 AM

2వ విడతలో ఎన్నికలు ఎక్కడెక్కడంటే.. (ఓటర్ల వారీగా)

పంచాయతీలు వార్డులు ఓటర్లు

● 9 మండలాల్లోని 186 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు

కర్నూలు(అర్బన్‌): జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మూడు విడతలుగా నిర్వహిస్తున్న ఈ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నోటిఫికేషన్‌ను ఈ నెల 13న విడుదల చేసిన విషయం విదితమే. మొదటి విడత ఎన్నికలకు నేటితో(17వ తేదితో) నామినేషన్ల స్వీకరణ పూర్తి కానుంది. జిల్లాలో మొత్తం 484 గ్రామ పంచాయతీలు ఉండగా, మొదటి దశలో ఎనిమిది మండలాల్లోని 148 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 26వ తేదీన పోలింగ్‌ జరగనుంది. 2వ విడతలో 9 మండలాల్లోని 186 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. రెండవ విడతలో మంత్రాలయం, కౌతాళం, కోసిగి, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల, కల్లూరు, ఓర్వకల్‌ మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలాల్లో ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే 2412 మంది పీఓ, 3876 మంది ఓపీఓ, ఆర్‌ఓలు 73, ఏఆర్‌ఓలు 73 మందితో పాటు 186 మంది స్టేజ్‌ –2 అధికారులను నియమించింది. ఈ విడతలో 39 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు, 122 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. ఆయా కేంద్రాల్లో పోలింగ్‌ సరళిని వెబ్‌క్యాస్టింగ్‌ చేయనున్నారు. మిగిలిన కేంద్రాల్లో వీడియోగ్రఫీ చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికల ప్రక్రియ ఇలా..

● ఈ నెల 18 నుంచి ఉదయం 10.30 గంటల నుంచి 20వ తేది సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

● 21న నామినేషన్ల పరిశీలన, 23న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్‌కు అవకాశం.

● 24వ తేది మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజున మధ్యాహ్నం 3 గంటల అనంతరం పోటీలోని అభ్యర్థుల తుది జాబితా ప్రకటన.

● 29వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌

● 29వ తేదినే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

● అదే రోజున ఉప సర్పంచు ఎన్నిక, ఏవైనా కారణాల రీత్యా ఉప సర్పంచు ఎన్నిక జరుగకపోతే మరుసటి రోజున (సెలవు దినం అయినప్పటికీ) ఎన్నిక నిర్వహణ.

● ఎక్కడైనా రీపోలింగ్‌ అవసరమైతే 30వ తేదిన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

మండలం గ్రామ మొత్తం మొత్తం

మంత్రాలయం 20 210 49,134

కోసిగి 24 242 56,785

కౌతాళం 30 302 59,680

పెద్దకడుబూరు 20 206 46,308

ఎమ్మిగనూరు 17 202 59,499

నందవరం 15 178 48,111

గోనెగండ్ల 20 226 59,816

కల్లూరు 18 186 38,479

ఓర్వకల్‌ 22 220 49,149

మొత్తం: 186 1,972 4,66,961

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement