గ్రామీణులకు డిజిటల్‌ వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

గ్రామీణులకు డిజిటల్‌ వైద్య సేవలు

Nov 17 2026 12:50 AM | Updated on Nov 17 2026 12:50 AM

కర్నూలు(సెంట్రల్‌): టెలిమెడిసిన్‌, ఈ–సంజీవని వంటి డిజిటల్‌ వైద్య సేవల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా నిపుణులైన వైద్యుల సలహాలు అందుబాటులోకి వస్తాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో సంజీవని కార్యక్రమ అమలు లక్ష్యాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోగుల వివరాలను డిజిటల్‌ రూపంలో నమోదు చేయాలన్నారు. ‘సంజీవని’ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా ఇంటింటి సందర్శనలు చేయించి రోగుల ఆరోగ్య పరిస్థితులను వాకాబు చేయించాలని వైద్యాధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు తక్షణ వైద్య సేవలు అందేలా రెఫరల్‌ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డిఎమ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ కామేశ్వర ప్రసాద్‌, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌ మరియు టీబీ అధికారి డాక్టర్‌ భాస్కర్‌, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ జాఫ్రుల్లా, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement