వైఎస్సార్‌సీపీకే ప్రజల మద్దతు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకే ప్రజల మద్దతు

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

● బస్తిపాడులో టీడీపీకి భారీ షాక్‌

● వైఎస్సార్‌సీపీలో 100 మంది చేరిక

● పార్టీలోకి ఆహ్వానించిన కాటసాని

రాంభూపాల్‌ రెడ్డి

కర్నూలు (టౌన్‌): చంద్రబాబు పాలనపై ప్రజలు విసుగు చెందారని, అందరూ వైఎస్సార్‌సీపీకే మద్దతు ఇస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి అన్నారు. బస్తిపాడుకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరడమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక కల్లూరులోని ఆయన స్వగృహంలో కల్లూరు మండలం బస్తిపాడు గ్రామానికి చెందిన టీడీపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. గ్రామ నాయకులు కేడీసీసీ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ కల్లా వెంకటరమణారెడ్డి, కల్లా మహేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జి. విష్ణువర్ధన్‌ రెడ్డి, బి. కృష్ణారెడ్డి, బి. రేవనాథ్‌ రెడ్డి, అరెపల్లె శేషిరెడ్డి, బోయ రామాంజనేయులు, బోయ శేఖర్‌, మాజీ సర్పంచ్‌ బోయ రవి, బోయ లక్ష్మన్న, బోయ రాంబాబు, బోయ సురేష్‌, పసుల ఓబులేస్‌, కురువ మధు, షేక్‌ ఈదురు భాష, బోయ మురళి తదితరులు సుమారు 100 మందితో కలిసి వైఎస్సా ర్‌సీపీలో చేరారు. వీరికి కండువాలు కప్పి సాద రంగా పార్టీలోకి నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్‌ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కాటసాని మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల విజయా నికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బస్తిపాడు, చిన్నకొట్టాల గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement