నీరు పారదు.. పొలం తడవదు | - | Sakshi
Sakshi News home page

నీరు పారదు.. పొలం తడవదు

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

● ఎల్లెల్సీ రైతులకు తప్పని తిప్పలు

హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)లో నీటి ప్రవాహం తగ్గి ఆయకట్టు రైతులకు పెద్ద కష్టం వచ్చింది. డిరస్ట్‌యీబ్యూటరీ(డీపీ) కాలువలకు నీరు రాకపోవడంతో ట్రాక్టర్లకు పంపింగ్‌ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని నీటిని తోడుకోవాల్సి వస్తోంది. అయినా పొలాలు తడవడం లేదు. తుంగభద్ర డ్యాం నుంచి ఎల్లెల్సీకి 1,675 క్యూసెక్కుల నీరును వదులుతుంటే జిల్లాకు 660 క్యూసెక్కుల రావాలి. అయితే 252 క్యూసెక్కులు మాత్రమే చేరుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోజలచౌర్యమే ఇందుకు కారణమని రైతులు చెబుతున్నారు. ఎల్లెల్సీకి ఈ నెల 20 వరకు నీటి సరఫరాను కొనసాగిస్తామని టీబీ బోర్డు అధికారులు ప్రకటించారు. దీంతో కొందరు జొన్న తదితర అరుతడి పంటలను, మరికొందరు వరి సాగు చేశారు. హొళగుంద సెక్షన్‌ 184 కి.మీ వద్ద ఎల్లెల్సీలో ఏడుఅడుగుల నీటిమట్టం ఉండాలి. ప్రస్తుతం నాలుగు అడుగుల వరకు తగ్గిపోయింది. దీంతో డిరస్ట్‌యీబ్యూటరీ(డీపీ) కాలువలకు నీరు అందడం లేదు. సాగులో ఉన్న పంటలకు మూడు తడులు నీరు అవసరం. డీపీలకు నీరు ఎక్కకపోవడంతో పంట దెబ్బతింటుందని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఎల్లెల్సీ అండర్‌ టెన్నల్‌లకు, కల్వర్టులకు భారీ రంధ్రాలు వేసి వంకలు, వాగులకు నీటిని మళ్లించుకుంటున్నారని, జల చౌర్యాన్ని ఆపాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement