● కర్నూలు, ఎమ్మిగనూరు,
ఆదోని డివిజన్లకు కూడా ఎకగ్రీవం
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ (పీడీఈఏ) నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. కర్నూలు సంపత్ నగర్‌లోని ఏపీ పవర్ డిప్లొమా ఇంజినీర్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సర్కిల్, డివిజన్‌లకు నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కర్నూలు సర్కిల్ అధ్యక్షుడిగా కే.చంద్రశేఖర్, కార్యదర్శిగా సి.వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా వినోద్‌బాబు, గంగభవాని, కోశాధికారిగా ఎన్‌జీ శంకర్, ఎమ్మిగనూరు డివిజన్ కార్యదర్శిగా జి.గోవిందు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసన్న అంజనేయులు, కోశాధికారిగా గురుమూర్తి, ఆదోని డివిజన్ కార్యదర్శిగా ఎంజీ లోకేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆంజనేయశాసీ్త్ర, కోశాధికారిగా మల్లికార్జున, కర్నూలు డివిజన్ కార్యదర్శిగా సంజీవరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రఘునాథ్, కోశాధికారిగా శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర మాజీ సెక్రటరీ జనరల్ టీఎన్ ప్రసాద్, ప్రస్తుత సెక్రటరీ జనరల్ నాగరాజరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మదన్‌మోహన్ ఎన్నికల అధికారులుగా పర్యవేక్షించారు. నూతన కార్యవర్గ సభ్యులతో వీరు ప్రమాణస్వీకారం చేయించారు. నూతన కర్నూలు సర్కిల్, డివిజన్‌ల కార్యవర్గ సభ్యులు విద్యుత్ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కర్నూలు సర్కిల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.


