కదిలిన వలస బండి | - | Sakshi
Sakshi News home page

కదిలిన వలస బండి

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

కర్ణాటకకు బయలుదేరిన పెద్దభూంపల్లి వాసులు

వందగల్లు నుంచి పిల్లలతో తరలి వెళుతున్న కూలీలు

తెలంగాణకు వలసబాట పట్టిన చిర్తనగల్‌ గ్రామస్తులు

రువు విలయతాండవం చేస్తుండటంతో వ్యవసాయ కూలీలు విలవిల్లాడుతున్నారు. గ్రామాల్లో చేసేందుకు పనులు లేక తట్టా బుట్ట సర్దుకొని ఇతర రాష్ట్రాలకు వలస బాట పడుతున్నారు. కోసిగి మండలం దుద్ది, వందగల్లు, చిర్తనగల్‌, పెద్దభూంపల్లి గ్రామాల నుంచి సోమవారం నాలుగు బొలెరో వాహనాల్లో కూలీలు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వలస బండి ఎక్కి వెళ్లారు. కడుపు మాడ్చుకొని ఉండలేక ఇళ్లకు తాళాలు వేసి బతకడానికి మూట సర్దుకొని బయలుదేరినట్లు వారు వాపోయారు. చిర్తనగల్‌ నుంచి 50 మంది కూలీలు, విద్యార్థులు 12 మంది, పెద్దభూంపల్లి నుంచి 20 మంది పెద్దలు, 10 మంది విద్యార్థులు వలసబాట పట్టారు. విద్యార్థుల చదువులు మాన్పించి, చంటి బడ్డలతో పత్తి తీసే పనికి వెళుతున్నట్లు వారు తెలిపారు. కరువు పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపాధి పనులు కల్పించలేక చేతులెత్తేసిందని, మరో పక్క సాగుచేసిన పంటలు ఎండిపోయి అప్పుల పాలయ్యామన్నారు. విధిలేని పరిస్థితుల్లో పొట్టకూటికి గ్రామాన్ని వదిలి వలస వెళుతున్నట్లు వాపోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వలసల నివారణకు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాలని, విద్యార్థుల కోసం సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.

– మంత్రాలయం రూరల్‌/కోసిగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement