నా భర్త చనిపోయి ఐదేళ్లు కావస్తోంది. మాకు ఎలాంటి భూమి లేదు. పింఛన్ దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా నా పేరిట 39 ఎకరాల భూమి ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో దరఖాస్తు తిరస్కరించారు. అధికారుల నిర్లక్ష్యంతో నాకు పింఛన్ రాకుండా పోయింది. – జయమ్మ, జంపాపురం
ఈ విషయంపై తహసీల్దార్ గీతా ప్రియదర్శినిని వివరణ కోరగా ఇటీవల కొరివి మంగమ్మ మా కార్యాలయానికి వచ్చారు. వీఆర్వోలు విచారణ చేసి ఆమె పేరిట ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదైన భూమిని తొలగిస్తాం అని చెప్పారు.


