విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్లు తగిలి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్లు తగిలి వ్యక్తి మృతి

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

కర్నూలు (సెంట్రల్‌): విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్లు తగిలి షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన కర్నూలు నగరంలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన రషీద్‌ అహ్మద్‌ (30) వన్‌టౌన్‌లోని కుమ్మరి వీధిలో నివాసముంటాడు. ఇతను ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. వృత్తి రీత్యా సోమవారం షేక్‌ నవాజ్‌ అనే యువకుడితో కలిసి కల్లూరులోని ఈశ్వరప్ప నగర్‌లో ఓ ఇంట్లో ఏసీ ఔట్‌డోర్‌ యూనిట్‌ అమర్చే పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో ఇంటిపై ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతని సహచరుడు షేక్‌ నవాజ్‌ రషీద్‌ కుటుంబ సభ్యులకు సమాచారమివ్వగా వారు వచ్చి ఆటోలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement