శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శుక్రవారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఆయనకు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ, అర్చకస్వాములు స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామి గౌరవార్థం వేదపండితులు వేదగోష్టి నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి భక్తులకు అనుగ్రహబాషణ చేశారు.


