14 నుంచి వినాయక చవితి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

14 నుంచి వినాయక చవితి ఉత్సవాలు

Sep 12 2026 1:48 AM | Updated on Sep 12 2026 1:48 AM

22న కర్నూలులో నిమజ్జనోత్సవం

కర్నూలు కల్చరల్‌: వినాయక చవితి ఉత్సవాలు ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని శ్రీ గణేష్‌ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర కార్యదర్శి గోరంట్ల రమణ, జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నాగఫణిశాస్త్రి తెలిపారు. శుక్రవారం వినాయక ఘాట్‌ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వేడుకలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ఉత్సవాలను స్వాతంత్య్ర సమరయోధులకు అంకింత చేస్తున్నామన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో ప్రజలను సంఘటితం చేసేందుకు బాల గంగాధర్‌ తిలక్‌ ఉత్సవాలను ప్రారంభించారన్నారు. పూర్తి సంప్రదాయబద్ధంగా హిందువుల ఐక్యత, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఉత్సవాలను నిర్వహించాలన్నారు. మట్టివినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తొమ్మిదిరోజుల పాటు ప్రతి రోజు రెండు పూటలా పూజ, హారతి, వందేమాతరం పూర్తి గేయాలాపన చేయాలన్నారు. ఈనెల 22న కర్నూలు నగరంలో వినాయక ఘాట్‌లోనే సామూహిక వినాయక నిమజ్జనం చేపడతామన్నారు. సమావేశంలో ఉత్సవ సమితి నగర అధ్యక్షులు రంగస్వామి, కార్యదర్శి గిరిరాజవర్మ తదితరులు పాల్గొన్నారు.

నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు నగరంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో వినాయక నిమజ్జన నిర్వహణపై ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీ కెనాల్‌కు అవసరమైన నీటిని తీసుకురావడానికి అన్ని అవకాశాలను మరోసారి పరిశీలించాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా నన్నూరు, తడకనపల్లె, ఉల్లిందకొండ సమీపంలో పారుతున్న హంద్రీనీవా కాలువల వద్ద ఘాట్లను ఏర్పాటు చే యాలన్నారు. నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నిమజ్జన ఊరేగింపుల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం తలెత్తకుండా బస్సు రూట్లను అవసరమైన మేరకు మళ్లించాలని సూచించారు. సమావేశంలో కర్నూల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఓబులేసు, కర్నూల్‌ ఆర్డీఓ సందీప్‌ కుమార్‌, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్‌ఈ రాజన్‌ బాబు, డీఎంహెచ్‌ఓ కామేశ్వర ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement