ప్రస్తుతం చుక్క నీరు లేని బావి
ఎండిన పంటలు.. అడుగంటిన బావులు.. నెర్రెలిచ్చిన చెరువులు.. జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. వేలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంట పొలాలను రైతులు ఇక లాభం లేదని దున్నేస్తున్నారు. టీడీపీ పాలనలో కరువు ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో ఈ బావిని చూస్తే అర్థమవుతోంది. 2022 అక్టోబర్ నెలలో కర్నూలు–నంద్యాల జాతీయ రహదారి పక్కనున్న పూడిచెర్ల పొలాల్లో ఓ బావి నిండు కుండను తలపించింది. ఇప్పుడు ఆ బావిలో చుక్క నీరు లేని పరిస్థితి. కరువు తీవ్రతకు ఈ దృశ్యం అద్దం పడుతుండగా.. ఈ దారిన వెళ్లే స్థానికులు ఎండిన బావిని చూసి రానున్న రోజులు ఇంకెంతటి దారుణ పరిస్థితులు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు


