శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో ప్రజానీకం అల్లాడిపోతున్నారని, రాఘవేంద్రుల అనుగ్రహంతో వర్షాలు కురిసి సుఖసంతోషాలు ప్రసాదించాలన్నారు. భక్తుల సహకారంతో శ్రీమఠంలో భక్తులకు వసతి కల్పనకు బాటలు వేస్తున్నామన్నారు. శ్రీమఠం వైభవానికి మరింతగా శ్రమిస్తామని పేర్కొన్నారు. నేపాల్‌లో వరద విపత్తుపై స్వామిజీ విచారం వ్యక్తం చేశారు. బాధిత దేశానికి శ్రీమఠం సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా అవుతోందని తెలిపారు.
హెలికాప్టర్‌తో పూలవర్షం


