గోనెగండ్ల: మండలంలోని గ్రామ శివారులో ఉన్న ఈశ్వర దేవాలయంలో గుప్త నిధుల కోసం వేట జరిగినట్లు వెలుగుచూసింది. బైలుప్పల గ్రామం నుంచి బన్నూరు గ్రామానికి వెళ్లే దారిలో ఒక పంట పొలంలో ఈ పురాతన శివాలయం ఉంది. ఇక్కడ గుప్త నిధులు ఉన్నట్లు గత కొన్నేళ్లుగా ప్రచారం సాగుతుంది. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు శివాలయం వెనుక భాగంలో గోడకు ఉన్న రాయిని గడ్డపారాలతో తొలగించారు. భక్తులు ఆదివారం గుర్తించి దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడే కొందరు గ్రామస్తులతో పాటు బయటి వ్యక్తులతో కలిసి దేవాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపించాడని స్థానికంగా ప్రచారం జరుగుతుంది.


