● 15 బైక్‌లు స్వాధీనం
బండిఆత్మకూరు: తెలంగాణతో పాటు తదితర ప్రాంతాల్లో బైక్‌లను అపహరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం పెబ్బేరు ప్రాంతంలో జరిగిన బైకు చోరీ కేసులో పట్టుబడిన నిందితుడిని సమాచారం మేరకు అక్కడి పోలీసులు బుధవారం లింగాపురం గ్రామం చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు గ్రామానికి చెందిన వల్లెం వెంకటరమణ, భూమా శివారెడ్డిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 15 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మరో బైక్‌ను రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు.


