దాడి చేసిన వారిపైన కాకుండా పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాడిలో గాయపడి చేయి విరిగిన ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ విషయం పక్కన పెట్టారు. తలకు చిన్న గాయమైన వ్యక్తికి ఆలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి తీవ్రగాయాలైనట్లు సర్టిఫికెట్ తీసుకున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి తమ ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారని ఆయనతో పాటు 34 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగకముందే తీవ్రమైన కేసు నమోదు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.


