ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి

Aug 13 2026 1:33 AM | Updated on Aug 13 2026 1:33 AM

● యూఎఫ్‌బీయూ

జిల్లా కన్వీనర్‌ నాగరాజు

కర్నూలు(అగ్రికల్చర్‌): బ్యాంకు ఉద్యోగు లు తీవ్రమైన పని ఒత్తిడి నుంచి బయట పడేందుకు వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) జిల్లా కన్వీనర్‌ నాగరాజు డిమాండ్‌ చేశారు. యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు బుధవారం కర్నూలు గాయత్రీ ఎస్టేట్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బుధవారపేట శాఖ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ప్రభుత్వరంగ, ప్రయివేటు, గ్రామీణ బ్యాంకులకు చెందిన అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. బ్యాంకు యూనియన్‌లు కొన్నేళ్లుగా చేస్తున్న డిమాండ్‌ల్లో ఐదు రోజు ల పని విధానం కల్పించాలనేది ప్రధానమైందన్నారు. ఈ డిమాండ్‌ను దాదాపు రెండేళ్ల క్రితం బ్యాంకు యూనియన్‌లతో జరిపిన చర్చల్లో ఐబీఏ అంగీకరించిందన్నారు. 2024 మార్చి 8న జరిగిన 12వ వేతన ఒప్పందంలో కూడా ఈ అంశాన్ని అంగీకరించి కేంద్రప్రభుత్వ అనుమతి కోసం ఐబీఏ ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ ఇప్పటి వరకు సానుకూల స్పందన రాకపోవడం దారుణమని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో ఏఐబీఈఏ జిల్లా నాయకులు శివకృష్ణ, అజయ్‌, వాసుదేవరెడ్డి, అన్వర్‌, ఏఐబీవోసీ నాయ కులు రాజు, చంద్రమోహన్‌, పుష్పక్‌కుమార్‌, ఎన్‌సీబీఈ నాయకులు విద్యాసాగర్‌, శ్రీకాంత్‌, ఏపీజీబీ నాయకులు హనుమంతురెడ్డి, రాఘవేంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement