ఎడమ చేతి వాటం.. అద్భుతం | - | Sakshi
Sakshi News home page

ఎడమ చేతి వాటం.. అద్భుతం

Aug 13 2026 1:33 AM | Updated on Aug 13 2026 1:33 AM

జన్యుమార్పులతోనే ఎడమ చేతివాటం

ప్రపంచ మేధావుల్లో

వారే అధికం

నేడు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే

దొర్నిపాడు: సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. ఎడమ చేతివాటం వారు నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. వారు చేసే పనులు, హావాభావాలు, కదలికలు అన్నీ వాళ్లవైపు తిప్పుకునేలా ఉంటాయి. అందుకే వారిని చూసి నేను లెఫ్ట్‌ అయ్యింటే బాగుండును.. అని అనుకుంటారు చాలా మంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఆగస్టు 13న ఇంటర్‌నేషనల్‌ లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే నిర్వహిస్తారు. కుడిచేతివాటం కల్గిన వారి కన్నా ఎడమ చేతివాటం వారు ఉన్నత స్థానాల్లో ఉంటారని వారికి తెలివి తేటలు గ్రహించే శక్తితో పాటు మంచి ఆలోచన శక్తి ఉంటుందని అంటారు. వీరికి జ్ఞాపకశక్తి, ఐక్యూ అధికంగా ఉన్నప్పటికీ చిన్నచిన్న విషయాలు వెంటనే మరచిపోవడం వీరికి సహజం. ఎడమ చేతివాటం ఉన్నవాళ్లు లెక్కలను కూడా చాలా వేగంగా చేయగలుతారని పలు పరిశోధనల్లో వెళ్లడైంది. అబ్దుల్‌ కలాం, ఐన్‌స్టీన్‌, న్యూటన్‌, మేరీక్యూరీ, అరిస్టాటిల్‌, అలాన్‌ ట్యూరింగ్‌ వంటి మేధావులంతా ఎడమచేతి వాటం ఉన్నవాళ్లే. అయితే ఎడమ చేతివాటం కల్గిన టైలర్లు కాస్త ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే కత్తెర, కుట్టుమిషన్‌ డిజైనింగ్‌ పూర్తిగా కుడిచేతివాటం వారికి సరిపోయే విధంగా తయారైఉంటాయి. కంప్యూటర్‌ మౌస్‌, డ్రైవింగ్‌ చేసే వారు ఇలా చాలా మంది ఇబ్బందులకు గురవుతారు.

ఒకే స్కూల్లో 13 మంది..

దొర్నిపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 13 మంది లెఫ్ట్‌హ్యాండర్స్‌ ఉన్నారు. వీరంతా చదువు, రైటింగ్‌, క్రీడల్లో ఎప్పుడు ప్రతిభ చూపుతుంటారు. ఒకే స్కూల్లో ఇంత మంది ఉండటం మాకు గర్వకారణం అని హెచ్‌ఎం చెన్నకేశ్వరి పేర్కొన్నారు. వారిని ప్రతి పనిలో అందరూ ప్రత్యేకంగా చూస్తుంటారని తెలిపారు.

మన ప్రాంతంలో చాలా మంది కుడిచేతితో డబ్బులు ఇవ్వడాన్ని, మంచి పనులు ప్రారంభించడాన్ని సెంటిమెంట్‌గా పరిగణిస్తారు. అందుకే చిన్నప్పుడే తల్లిదండ్రులు ఎడమ చేతివాటం గమనిస్తే మాన్పించే ప్రయత్నం చేస్తారు. వారికి జన్యుపరమైన మార్పులు ఉన్నప్పుడు మనం ఏమి చేయలేం. అందుకే వారిని ఇబ్బందులకు గురిచేయవద్దు. వయస్సు పెరిగేకొద్ది సంప్రాదాయాలు చెబితే వారు అర్థం చేసుకోని పద్ధతులను బట్టి నడుచుకోగలరు.

– డాక్టర్‌ నేగల ఉశేని,

పీహెచ్‌సీ, డబ్ల్యూ కొత్తపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement