అవార్డుకు
ఎంపికై న చిత్రం
కర్నూలు(సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ (ఏపీపీజేఏ) జాతీయ స్థాయిలో నిర్వహించిన ఫొటో కాంపిటీషన్‌లో కర్నూలులో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్న వడ్డె శ్రీనివాసులు ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 19న జరిగే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీపీజేఏ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలకు 110 మంది ఫొటోగ్రాఫర్లు 440 ఫొటోలను పంపారు. ఇందులో అచీవ్‌మెంట్ విభాగంలో శ్రీనివాసులు తీసిన ఫొటోకు అవార్డు దక్కింది.


