వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా రెడ్‌బుక్ రాజ్యాంగం
రెండేళ్లుగా కొనసాగుతున్న వేధింపులు
అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసుల విధులు
తాజాగా అక్రమ కేసులతో ఆలూరు ఎమ్మెల్యేకు జైలు
కనీస విచారణ లేకుండానే కేసుల నమోదు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: చంద్రబాబు పాలనలో పోలీ సులు పెట్రేగిపోతున్నారు. పచ్చపార్టీ నేతలమెప్పుకోసం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమకేసు లు బనాయిస్తున్నారు.శాసనసభ్యులన్న గౌరవం లేకుండా ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారు. నిర్భంధించి వేధింపులకు గురిచేస్తున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి విషయంలో ఇదే జరిగింది. పక్కా ప్రణాళికతో పోలీసులను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేపై పలుకేసులు నమోదు చేయించి జైలుకు పంపారు. ఎస్సీ మహిళ వస్త్రాలను చింపివేశారని ఆయనతోపాటు సోదరుడు, కుమారుడిపైనా ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంతటితో ఆగక పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనా కేసులు బనాయించారు. అయితే ఎస్సీ మహిళ వస్త్రాలు ఎమ్మెల్యే చింపలేదని, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయించేందుకు మహిళ భర్త ఉద్దేశపూర్వకంగా భార్య బట్టలు చింపినట్లు ఓ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీడీపీ నేతల దిగజారుడు రాజకీయాన్ని ఈ వీడియో ప్రశ్నిస్తోంది.
టీడీపీ నేతల కనుసన్నల్లో అక్రమ కేసులు


