శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.75కోట్లు | - | Sakshi
Sakshi News home page

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.75కోట్లు

Aug 6 2026 2:20 AM | Updated on Aug 6 2026 2:20 AM

మంత్రాలయం: శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3,75,91,531 లభించింది. బుధవారం శ్రీమఠం రాజ్యాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. జూలై 14 నుంచి ఆగస్టు 4 తేది వరకు సంబంధించి 21 రోజుల హుండీ కానుకలను అధికారులు లెక్కగట్టారు. నగదు రూపంలో రూ 3,65,16,531.. నాణేలా రూపంలో రూ.10,75,000 వచ్చింది. అలాగే 49 గ్రాముల బంగారం, 865 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు మేనేజర్‌ ఎస్‌.కె శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్‌–2 వెంటేష్‌ జోషి, ఇంజనీర్‌ సురేష్‌కోనాపూర్‌, అనంతపురాణిక్‌ పాల్గొన్నారు.

11 మండలాల్లో తేలికపాటి వానలు

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 11 మండలాల్లో వర్షపాతం నమోదైంది. కోసిగిలో 24.8 మి.మీ, పెద్దకడుబూరులో 19.4, కోడుమూరులో 17.4, గోనెగండ్లలో 13.4, ఎమ్మిగనూరులో 12.8, నందవరంలో 7.2, క్రిష్ణగిరిలో 3.2, మద్దికెరలో 1.4, కర్నూలు రూరల్‌లో 0.8, కర్నూలు అర్బన్‌లో 0.6, కౌతాళంలో 0.4 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 3.8 మి.మీ వర్షం కురిసింది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 117 మి.మీ ఉండగా ఐదు రోజుల్లో 19 మి.మీ వర్షపాతం నమోదైంది. రానున్న రోజుల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నేడు జెడ్పీలో

సాగు, తాగునీటిపై సమీక్ష

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌లోని మినీ సమావేశ భవనంలో ఈ నెల 6న మధ్యాహ్నం 3 గంటలకు ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీటికి సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ఆర్‌.సుధాకర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణ, సాగునీటి కాలువల ద్వారా నీటి విడుదల అంశాలపై సమీక్ష కొనసాగుతుందన్నారు. సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెంది న జెడ్పీటీసీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌ అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు.

దివ్యాంగుల ఉద్యోగాలకు తాత్కాలిక మెరిట్‌ జాబితా

కర్నూలు(అర్బన్‌): విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలకు(నాన్‌ డీఎస్‌సీ) తా త్కాలిక మెరిట్‌ జాబితా, తిరస్కరణ వివరాల ను విడుదల చేసినట్లు విభిన్న ప్రతిభావంతు లు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ఫాతిమా తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఈ ఏడాది మార్చి 14, మే 6వ తేదిన ప్రకటన విడుదల చేశామన్నా రు.బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడు తూ ఆయా కేటగిరీలకు సంబంధించి ల్యాబ్‌ అటెండెంట్‌, ఆఫీసు సబార్డినేట్‌, వాచ్‌మెన్‌, క్లీనర్‌, నైట్‌ వాచ్‌మెన్‌, పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్‌, పబ్లిక్‌ హెల్త్‌ మేసీ్త్ర పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించామన్నారు. ఇందుకు సంబంధించి మెరిట్‌ జాబితాను తమ కార్యాలయంలోని నోటీసు బోర్డులో, డిస్ట్రిక్ట్‌ వెబ్‌సైట్‌ https://kurnool.ap.gov.inలో ఉంచామన్నారు. వివరాల్లో ఏవైనా ఆక్షేపణలు ఉంటే ఈ నెల 14వ తేది సాయంత్రం 5 గంటల్లోపు లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. కార్యాలయ మెయిల్‌ ఐడీ: addwknl@gmail.com ద్వారా తగిన ఆధారాలతో తెలియజేయవచ్చన్నారు.

టెట్‌ పరీక్షలు ప్రారంభం

కర్నూలు సిటీ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. జిల్లాలో ఐదు కేంద్రాలు, హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నాలుగు కేంద్రాల్లో పరీక్ష జరుగగా 622 మందికిగాను 547 మంది హాజరయ్యా రు. మధ్యాహ్నం సెషన్‌లో జరిగిన పరీక్షకు 476 మందికిగాను 440 మంది హాజరుకాగా 36 మంది గైర్హాజరయ్యారు.

కొలనుభారతిలో

రేపు శాకంబరీ ఉత్సవం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీకొలనుభారతి క్షేత్రంలో శుక్రవారం సరస్వతి అమ్మవారికి శాకంబరీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థాన చైర్మన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటలో బుధవారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement