వరిగడ్డికి పెరిగిన డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

వరిగడ్డికి పెరిగిన డిమాండ్‌

Jul 31 2026 1:45 AM | Updated on Jul 31 2026 1:45 AM

ఎల్‌నినో నేపథ్యంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో వరిగడ్డికి విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. జిల్లాలోని తుగ్గలి, మద్దికెర, వెల్దుర్తి, క్రిష్ణగిరి, దేవనకొండ, ఆదోని, ఆస్పరి, కోడుమూరు, గూడూరు, సీ బెళగల్‌ తదితర మండలాల రైతులు వరిగడ్డిని సమకూర్చుకోవడంలో నిమగ్నమయ్యారు. గత ఏడాది ట్రాక్టరు వరిగడ్డికి రూ.10 వేల వరకు ధర లభించింది. ఈ సారి రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు ధరలు పెరిగిపోయాయి. ఎల్‌నినో ప్రభావంతో పశుపోషణ భారం కావడంతో రైతులు పశువులను సంతకు తరలిస్తున్నారు. ప్రతి గురువారం డోన్‌తో సంత జరుగుతుంది. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది డోన్‌ సంతకు 15 నుంచి 20 శాతం వరకు పశువులు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement