శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంటలోని జలవనరుల శాఖకు చెందిన సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తులు ప్లాట్ల విక్రయానికి తెగబడుతున్నారు. అటవీశాఖ కార్యాలయం, ప్రభుత్వ ఐటీఐ కళాశాల వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు వేస్తున్నారు. ఇప్పటికే సున్నిపెంటలోని ప్రభుత్వ భూములు, గృహాల అన్యాక్రాంతంపై హైకోర్టు విచారణ జరుపుతున్నప్పటికీ, కూటమి ప్రభుత్వ నేతల అండతో ఏ భయం లేకుండా ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అమ్మకానికి పెట్టారు. సుమారు 40 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో సన్నకార రైతులు ఆకుకూరలు, కూరగాయలు పండించి వినియోగించుకుంటున్న భూమికి అద్దెలు చెల్లించేవారు. కాలక్రమేణా ఎటువంటి అధికారం లేకుండానే క్రయవిక్రయాలు జరిగాయి. యలమంచిలి రవి అనే వ్యక్తి ఆ ప్రాంతంలో గోశాలను నిర్వహించేవాడు. రవి, ఆయన సతీమణి మరణాంతరం ఈ స్థలాలు తమవంటు ఫేక్ డ్యాక్‌మెంట్లు సృష్టించుకొని శ్రీధర్, శివకుమార్ అనే వ్యక్తులు ప్లాట్ల విక్రయానికి తెరలేపారు. ఇంత జరుగుతున్నా జిల్లా పంచాయతీ, జలవనరుల, రెవెన్యూ శాఖ అధికారులు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


