హాలహర్వి: తుంగభద్ర జలాలు ఎట్టకేలకు హాలహర్వి మండల సరిహద్దుకు చేరుకున్నాయి. ఈనెల 16న తుంగభద్ర డ్యాం నంచి ఎల్లెల్సీకి విడుదల చేసిన నీరు ఆదివారం చింతకుంట 135వ కి.మీ. వద్దకు చేరుకున్నాయి. ఈ జలాలను చూసి సరిహద్దు గ్రామాల ప్రజలు, సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్లెల్సీకి విడుదల చేసిన నీరు తాగునీటి అవసరాలకే వినియోగించాలని, ఎవరూ పొలాలకు వినియోగించరాదని డ్యాం అధికారులు తెలిపారు.
17 మండలాల్లో జల్లులు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని 17 మండలాల్లో ఆదివారం తేలికపాటి వర్షాలు కురిశాయి. ఆస్పరి, కోడుమూరు, పెద్దకడబూరు, గోనెగండ్ల, ఆదోని, కౌతాళం, హొళగుంద, కోసిగిలో జల్లులు మాత్రమే పరిమితమయ్యాయి. జిల్లా మొత్తంగా 6.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. జూలై నెల సాధారణ వర్షపాతం 90.5 మి.మీ. ఉండగా 19 రోజుల్లో 13.4 మి.మీ. వర్షం కురిసింది.


