జింకల బెడద నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రాత్రింబవళ్లు పంటకు కాపాలా ఉండాలంటే ఎంతో కష్టం. ఈ నేపథ్యంలో కొందరు రైతులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఆలూరు గ్రామానికి చెందిన కురుబ మల్లికార్జునప్ప మూడెకరాల్లో కంది సాగు చేశాడు. జింకల బెడద నుంచి పంటను కాపాడుకోవడానికి పొలం గట్టున జమ్మి చెట్టు ఉండటంతో దానికి ఖాళీ బ్రాందీ సీసాలను కట్టాడు. అవి గాలికి కదులుతూ.. ఒకదానికొకటి కొట్టుకోవడంతో శబ్దం వస్తోంది. ఈ శబ్దానికి జింకలు తమ పొలం వైపు రావడం లేదని రైతు చెబుతున్నాడు. – ఆలూరు


