సుశీలేంద్రతీర్థులకు సువర్ణ కవచ సమర్పణ | - | Sakshi
Sakshi News home page

సుశీలేంద్రతీర్థులకు సువర్ణ కవచ సమర్పణ

Jul 18 2026 3:35 AM | Updated on Jul 18 2026 3:35 AM

సుశీలేంద్రతీర్థులకు సువర్ణ కవచ సమర్పణ

మంత్రాలయం: సుశీలేంద్రతీర్థుల బృందావనానికి శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు చేతుల మీదుగా సువరణ కవచ సమర్పణ చేశారు. శుక్రవారం కర్ణాటక రాష్ట్రంలోని హావేరి జిల్లాలోని హోసరెట్టిలో సుశీలేంద్ర ఆరాధనోత్సావాలు ఘనంగా చేపట్టారు. ముందుగా శ్రీమూల రాముల పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సుశీలేంద్ర మూలబృందావనానికి పంచామృతాభిషేకం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేపట్టారు. సువర్ణ కవచాన్ని పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు చేతులు మీదుగా అలంకరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మట్లాడుతూ.. శ్రీమఠంలో ప్రతిరోజు పీఠాధిపతి పాద కానుకల ద్వారా వచ్చిన కానుకతో సుశీలేంద్రతీర్థులకు రెండు బంగారు కవచాలను తయారు చేసినట్లు తెలిపారు. సుశలేంద్రతీర్థులకు వెండి ప్రతిమను చేయించామన్నారు. భక్తులకు పీఠాధిపతి మద్రాధారణ చేశారు.

నేడు, ఆగస్టు 1న

పాస్‌పోర్టు స్పెషల్‌ డ్రైవ్‌

కర్నూలు(అర్బన్‌): జిల్లా కేంద్రంలోని హెడ్‌ పోస్టాఫీసులో ఈ నెల 18(నేడు), ఆగస్టు 1వ తేదిన పాస్‌పోర్ట్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు కర్నూలు డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ జి.జనార్దన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే పాస్‌పోర్ట్‌ స్లాట్‌ బుకింగ్‌, రీ షెడ్యూల్‌కు అవకాశం కల్పిస్తామన్నారు. వారంలో ఐదు రోజులే పనిచేసే పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం ఆయా తేదీల్లో(శనివారం) కూడా పనిచేస్తుందన్నారు. వినియోగదారుల సౌకర్యం కోసం నిర్వహిస్తున్న స్పెషల్‌ డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

దివ్యాంగులకు పద్మ పురస్కారాలు

కర్నూలు(అర్బన్‌): అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తున్న విభిన్న ప్రతిభావంతులకు(దివ్యాంగులు) పద్మ పురస్కారాలు ప్రదానం చేసేందుకు ఆన్‌లైన్‌లో రాష్ట్రీయ పురస్కార్‌ పోర్టల్‌(www.awards.gov.in)ద్వారా ప్రతిపాదనలు పంపించాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ఫాతిమా కోరారు. గతంలో పద్మ అవార్డు పొందిన వారికి కనీసం ఐదేళ్ల వ్యవధి ఉండాలని ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అవార్డును మరణాంతరం ప్రదానం చేయరని, అయితే అవార్డు ప్రకటించేందుకు ప్రతిపాదించిన గణతంత్ర దినోత్సవానికి ( 25 జనవరి 2026 తరువాత ) ఒక సంవత్సరం లోపు కాలంలో ఎవరైనా మృతి చెందినట్లయితే వారి ప్రతిపాదనలను పరిశీలించవచ్చన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 31లోగా ( www.awards.gov.in)) వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఎన్‌పీసీఐ పెండింగ్‌ లేకుండా చూసుకోండి

కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులు తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సహాయాన్ని పొందేందుకు బ్యాంకు ఖాతా లేదా ఎన్‌పీసీఐ సీడింగ్‌ పెండింగ్‌లో ఉన్న విద్యార్థులు వెంటనే పూర్తి చేసుకోవాలని సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక చెప్పారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు తల్లికి వందనం ఆర్థిక సహాయం ఈ నెల 22వ తేదిన విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ ఆర్థిక సహాయం పొందేందుకు బ్యాంకు ఖాతా లేని ఎస్సీ విద్యార్థులు ఇండియా పోస్టు పేమెంట్స్‌ బ్యాంకు(ఐపీపీబీ) ద్వారా కేవలం రూ.200తో ఖాతా ప్రారంభించుకునే అవకాశం ఉందన్నారు. అవసరమైతే పాన్‌ కార్డు స్థానంలో ఫారం –97 ద్వారా కూడా ఖాతా తెరవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement